- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'150వేల సభ్యత్వం గల ఏకైక సంఘం ఆర్యవైశ్య మహాసభ'
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆర్యవైశ్య మహాసభలో 150 వేల సభ్యత్వం ఉన్న ఏకైక సంఘం ఆర్యవైశ్య మహాసభ అని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్, రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి కిషన్ ఆయనను ఆహ్వానించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ సంఘం సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని అన్నారు.
కరోనా సమయంలో ఎంతో మందికి అన్నదానాలు, నిత్యావసర సరుకులు అందించిన సంఘం తమదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్య వైశ్యులకు గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపాలిటీ చైర్మన్ పదవులు, 5 కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆర్యవైశ్యులకు కేటాయించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తోపాజి అనంతకిషన్ మాట్లాడుతూ రాజకీయంలో ఆర్యవైశ్యులకు అవకాశం కల్పించాలన్నారు. శాసనసభ శాసనమండలిలో సమాన హక్కులు కల్పించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య మహాసభ సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి సుష్మ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ గుప్త, జిల్లా అధ్యక్షురాలు పురం రజిని నాయకులు పాంపాటి కృష్ణమూర్తి, విద్యాసాగర్, బుచ్చి లింగం, సుజాత, స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.