Arvind Kejriwal: గుజరాత్‌పై అరవింద్ కేజ్రీవాల్ కన్ను

by Satheesh |   ( Updated:2022-07-21 12:04:11.0  )
Arvind Kejriwal Assures free 300 units of power to people of Gujarat
X

న్యూఢిల్లీ: Arvind Kejriwal Assures free 300 units of power to people of Gujarat| గుజరాత్ రాష్ట్రంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కన్ను పడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గుజరాత్‌లోని అన్ని గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని గురువారం సూరత్‌లో హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు 24/7 ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ఆప్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇదే ఉత్సాహంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. కాగా, పంజాబ్‌లో పెండింగ్‌ బిల్లులను డిసెంబర్ 31వ తేదీ నాటికి మాఫీ చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు తనను ఎదురుదెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల యూపీలో ప్రధాని మోడీ ఉచిత సంస్కృతి స్వస్తి పలకాలని తెలిపారు. ఉచిత హామీలు ఇచ్చి ఓట్లు అడిగే పద్ధతిని మానుకోవాలని ప్రధాని సూచించారు. దీని వల్ల ఎంతో ప్రమాదం ఉందన్నారు. ఆప్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారని సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీపై మండిపడ్డారు. ఉచిత విద్యుత్, వైద్యం, విద్య, నీరు, ఇతర సేవలు ఫ్రీగా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌లోనూ ఇలాంటి హామీలే చేశామని, అందుకే భారీ మెజార్టీతో గెలిచామన్నారు. పంజాబ్‌లో ఇచ్చిన హామీలను త్వరలో అమలు చేస్తామన్నారు. తప్పు చేశానని ప్రతిసారి చెబుతున్నారు.. నేనేం తప్పు చేశానో చూపించాలని సీఎం డిమాండ్ చేశారు. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ జెట్‌లలో ప్రయాణించే కల్చర్‌ను పక్కన పెట్టానని.. ఆ డబ్బులతో ఢిల్లీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: అరుదైన ఫొటో రిలీజ్ చేసిన ప్రభుత్వం..

Advertisement

Next Story

Most Viewed