వాటిని అక్రమ రవాణా చేస్తున్న.. పాత నేరస్థుడి అరెస్ట్!

by Vinod kumar |
వాటిని అక్రమ రవాణా చేస్తున్న.. పాత నేరస్థుడి అరెస్ట్!
X

దిశ, కంటోన్మెంట్: దొంగతనాన్ని ప్రవృత్తిగా ఎంచుకొని దేవాలయాలను, తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడటంతో పాటు మరోవైపు గంజాయి విక్రయిస్తున్న పాత నేరస్థున్ని కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నాందేడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ పాషా జీవనోపాధి కోసం వచ్చి మేడ్చల్ లో ఉంటున్నాడు. తాళం వేసి ఉన్న ఇండ్లు, దేవాలయాలను టార్గెట్ చేస్తూ.. పాషా చోరీలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై మూడు పోలీస్ కమీషనరేట్ల పరిధిలో 13 కేసులు నమోదై ఉన్నాయి. ఇతనిపై పీడీ యాక్ట్ కూడా ఉంది. దొంగతనాలకు పాల్పడడంతో పాటు గంజాయిని కూడా వక్రయిస్తుంటాడు. తనకు శత్రువులు ఉన్నరన్న నెపంతో కత్తులను వెంట తీసుకుని తిరుగుతుంటాడు. విశ్వసనీయ సమాచారం మేరకు కార్ఖానా పోలీసులకు గంజాయి అక్రమంగా సరఫరా చేస్తూ.. పాషా చిక్కాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాల చిట్టా విప్పాడు. నింధితుడి వద్ద నుంచి కిలో గంజాయి, 10 గ్రాముల హాష్ ఆయిల్, 10 మొబైల్ ఫోన్లు, కత్తులు, ద్విచక్ర వాహనాలు కృత్రిమ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed