Mini workouts: మినీ వర్కౌట్స్.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?

by Anjali |   ( Updated:2025-01-04 16:00:10.0  )
Mini workouts: మినీ వర్కౌట్స్.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?
X

దిశ, వెబ్‌డెస్క్: వర్కౌట్స్ (workouts)బాడీని స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు చేస్తాయి. మీ మానసిక ఆరోగ్యం(mental health), మానసిక స్థితిని వ్యాయామం మెరుగుపరుస్తుంది. ఎక్సర్‌సైజ్ బాడీని రిలాక్స్‌(Relax the body)గా ఉండేలా చేసే రసాయనాలను విడుదల చేస్తుంది. ఒత్తిడి(Stress), ఆందోళన(anxiety) నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డిప్రెషన్(Depression) ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాగా ఉదయం లేదా సాయంత్రం పూట ప్రతిరోజూ వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే చాలా మంది గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తుంటారు. కానీ సమయం తక్కువ ఉన్నవారు మాత్రం కొంతసేపటి వరకే వర్కౌట్స్ చేస్తారు. దీన్నే మినీ వర్కౌట్(Mini workouts) అంటారు. మినీ వర్కౌట్ కేవలం 5నుంచి పది నిమిషాలు మాత్రమే చేస్తారు. కానీ డే మొత్తం యాక్టివ్‌గా ఉంచేలా చేస్తుంది. డంబెల్స్(Dumbbells) సాయంలో రోజూ 10 నిమిషాలు కసరత్తులు చేస్తే జీవక్రియతో పాటు క్యాలరీస్ బర్న్(Burn calories) అయి.. వెయిట్ కూడా లాస్ అవుతారు. అంతేకాకుండా జీవక్రియ సాఫీగా జరుగుతుంది. కండరాల్లో బలం పెరగుతుంది. మినీ వ్యాయామం బాడీని ఫ్లెక్సిబిలీటీ(Flexibility)గా ఉంచుతుంది. అలాగే మానసికంగా హెల్తీగా ఉంచడమే కాకుండా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాగా మినీ వర్కౌట్స్ వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవంటున్నారు నిపుణులు.

Read More...

పిల్లలు మానసికంగా స్ట్రాంగ్‌ అవ్వాలంటే తల్లిదండ్రులు చేయాల్సినవివే?


Advertisement

Next Story

Most Viewed