- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AR Rahman: భార్యతో విడాకులు.. పగిలిన హృదయంతో అంటూ ఏఆర్ రెహమాన్ ఎమోషనల్ ట్వీట్
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలోని జంటలు ఊహించని విధంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఏవో కారణాల వల్ల తమ బంధానికి ముగింపు చెబుతున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు కారణం ఏంటో తెలియక అయోమయంలో పడిపోతున్నారు. తాజాగా, సినిమా ఇండస్ట్రీలో(Film Industry) మరో జంట విడాకులు తీసుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్(AR Rahman), సైరా భాను(Saira Bhanu) విడిపోయినట్లు వారి లాయర్ వందనా షా(Vandana Shah) అధికారికంగా ప్రకటించారు.
ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కొందరు అబద్దమైని అంటుంటే మరికొందరు షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఏఆర్ రెహమాన్(AR Rahman) ‘X’ ద్వారా విడాకులపై స్పందిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. ‘‘మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. పగిలిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి. కానీ పలిగిన ముక్కలు మళ్లీ యథావిధిగా అతుక్కోలేవు. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం.
ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కాగా, రెహమాన్, సైరా భాను(Saira Bhanu) 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమ్(Rahim), అమీన్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ జంటకు వివాహం జరిగి 29 ఏళ్లు పూర్తి కావొస్తోంది. ఈ క్రమంలో విడిపోవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. ప్రజెంట్ ఆయన రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC16 సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024