Anushka Sen: కొరియన్ వెబ్ సిరీస్‌లో చాన్స్ కొట్టేసిన అనుష్క..

by Harish |   ( Updated:2022-04-11 12:03:09.0  )
Anushka Sen: కొరియన్ వెబ్ సిరీస్‌లో చాన్స్ కొట్టేసిన అనుష్క..
X

దిశ, సినిమా: యంగ్ సెన్సేషన్ అనుష్క సేన్ బంపర్ ఆఫర్ చేజిక్కుంచుకున్నట్లు తెలిపింది. అతి చిన్న వయసులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తాజాగా కొరియన్ సినిమా మార్కెట్ లోకి ప్రవేశించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఓ ప్రాజెక్ట్ కోసం సంతకం కూడా చేశానని వివరించింది. అక్కడ కూడా రాణించేందుకు అభిమానుల సహకారం అవసరమని, రెండు దేశాల ప్రజలు తనకు మద్దతివ్వాలని కోరింది. అలాగే కొరియన్ ప్రజలు మన సంస్కృతిని ఇష్టపడతారన్న నటి.. కొరియాలో తనకున్న అభిమానుల సంఖ్య చూసి ఆశ్చర్యపోయానని, సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే తన అభిమానుల కోసమే నిరంతరం నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటానన్న ఆమె.. తన కథను ఇతరులతో పంచుకుంటూనే ఇతరుల స్టోరీలను కూడా వినేందుకు ఆసక్తి చూపిస్తానంటోంది అనుష్క సేన్.

Advertisement

Next Story

Most Viewed