- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anchor Pradeep: గుడ్ న్యూస్ ప్రకటించిన యాంకర్ ప్రదీప్.. దీపికా పిల్లితో ఉన్న ఫొటో షేర్ చేసి బిగ్ షాకిచ్చాడుగా! (ట్వీట్)
దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Anchor Pradeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఆయన వరుస షోలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలాగే పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’(30 Rojullo Preminchadam Ela) అనే సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది కానీ హిట్ అందుకోలేకపోయింది.
దీంతో మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు షోలు చేశారు. ఏమైందో తెలియదు కానీ గత కొద్ది కాలం నుంచి ప్రదీప్(Anchor Pradeep) టీవీ షోల్లో కనిపించడం లేదు. అలాగే సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్‌గా కూడా ఉండటం లేదు. దీంతో ఆయన అభిమానులు ప్రదీప్‌కు ఏమైందని ఆందోళన చెందుతూ పలు పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా ఆయన సైలెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ప్రదీప్(Anchor Pradeep) తన సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించారు. ఎట్టకేలకు తన రెండో సినిమాను అనౌన్స్ చేస్తూ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.
ఈ సినిమాకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi)టైటిల్‌ను ప్రదీప్ (Anchor Pradeep)తన రెండో సినిమాకు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రంలో జబర్థస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) హీరోయిన్‌గా నటిస్తోంది. నితిన్(Nithin), భరత్ (Bharat)ద్వయం దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రజెంట్ ప్రదీప్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారు మొత్తానికి అనుకున్నది చేసి అందరికీ సడెన్ షాకిచ్చాడని కామెంట్లు పెడుతున్నారు.