- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభిమానుల రుణం తీర్చుకోలేనంటున్న నటి.. మీరే నా ఆర్మీ అంటూ
దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో కొత్త ఫొటో, వీడియోలతో నెట్టింట్లో సందడి చేసే ఆమెకు ట్రోల్స్ కూడా కొత్తేమి కాకపోగా.. ఇటీవల ఉమెన్స్ డే రోజు 'మహిళలందరికీ హాపీ ఫూల్స్ డే' అంటూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి తన ఫ్యాన్స్‌ను పొగుడుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ స్పెషల్ నోట్ షేర్ చేసింది. ఈ మేరకు తన పేరుతో ఉన్న ఫ్యాన్స్ పేజీలపై ప్రేమను కురిపించిన నటి.. 'నా ఫ్యాన్ పేజీలను నడిపించే వారందరికీ థ్యాంక్స్. ఎంతో జెన్యూన్‌గా, బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
నా అభిమానులుగా మీరెప్పుడూ ఇతరులకు ఇబ్బంది కలిగించలేదు. అబద్ధాలు, కాంట్రవర్సీలకు దారితీయకుండా నిజాన్ని చెప్పడానికే ప్రయత్నించారు. నా మీద కూడా ఎలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేయకుండా ప్రేమను కురిపిస్తున్నందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను' అని రాసుకొచ్చిన అనసూయ.. 'ఎవరితోనూ పోల్చకుండా నన్ను నన్నుగా ప్రోత్సాహించినందుకే ఇలా స్ట్రాంగ్‌గా నిలబడ్డాను. మీరే నా ఆర్మీ' అంటూ తన ఫాలోవర్స్, అభిమానులను పొగిడేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.