- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anasuya: మీరే మగజాతి పరువు తీస్తున్నారు.. అనసూయ ట్వీట్ వైరల్
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. గ్లామర్ లుక్స్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న నటి.. తరచూ నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన డ్రెస్సింగ్‌పై విమర్శలు వ్యక్తమవగా ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. 'అనసూయ గారు, ఇద్దరు పిల్లల తల్లయిన మీరు ఇంకా ఇలాంటి చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటారా? తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారు' అంటూ ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. 'దయచేసి మీ పని మీరు చూసుకోండి. నా పని నన్ను చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అంటూ కౌంటర్ ఇచ్చింది.
ఇక మరో కామెంట్‌కు ఆన్సర్ ఇస్తూ.. 'అనవసర విషయాలపై మాట్లాడటం టైమ్ వేస్ట్. కొద్దిమంది పురుషులకు తమ కుటుంబాల్లో, పని ప్రదేశాల్లో స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి? ఎలా గౌరవించాలనే అంశంపై అవగాహన కల్పించాలి' అని పేర్కొంది. కాగా ఈ ఇష్యూలో అనసూయకు మద్దతిస్తున్న అభిమానులు.. పెళ్లయి, పిల్లలున్న హీరో హీరోయిన్లు బోల్డ్ సీన్లు చేయట్లేదా? బికినీ, టాప్‌లెస్ ఫొటోలు పోస్ట్ చేయట్లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
ముస్లింలకు క్షమాపణలు చెప్పిన నటి.. అతడిని అలా అన్నందుకే!
దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022