హత్య కేసును ఛేదించిన పోలీసులు.. కారణం అదేనా..?

by Web Desk |
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. కారణం అదేనా..?
X

దిశ, పటాన్‌చెరు: అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 10న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భీమ్ రెడ్డి వివరాలను వెల్లడించారు.

జీవంగి గ్రామం, బాసిరాబాద్ మండలం, వికారాబాద్ జిల్లాకు చెందిన ఎరుకల వెంకటప్ప (39) కుటుంబం కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం వచ్చి గంగారం లో నివాసముంటున్నారు. భార్య పద్మ ఇళ్ళల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో మృతుడి భార్య పద్మ రెహమాన్ మేస్త్రి దగ్గర మృతుడు వెంకటప్ప పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మృతుడి భార్య పద్మతో రెహమాన్ సన్నిహితం పెంచుకోగా అది కాస్త వివాహేతర సంబంధం గా మారింది.

ఒకరోజు వెంకటప్ప లేని సమయంలో ఇంట్లో ఇద్దరూ ఉండగా అది చూసిన భర్త వెంకటప్ప భార్యను మందలించాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను ఎలాగైనా కడతేర్చాలనే పథకం వేశారు. మృతుడి భార్య పద్మ, ప్రియుడు రెహమాన్ తో పథకం రచించింది. కాగా ఈ నెల 8న రెహమాన్ చందానగర్ లో గల కూలి అడ్డ పైకి వచ్చి తన స్కూటర్ పై పని ఉందంటూ.. వెంకటప్ప ను ఎక్కించుకొని తన వద్ద పనిచేసే సుభాష్ తో పాటు ముగ్గురు కలిసి స్కూటర్ పై కొల్లూరు సమీపంలో హత్య చేసేందుకు తీసుకెళ్లారు.

అక్కడ పని బెడిసికొట్టడంతో అక్కడి నుంచి కొల్లూరు తీసుకెళ్లి ఓ బెల్టు షాపుల్లో మద్యం తీసుకొని సేవించి హత్య చేసేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల జనాలు ఉండడంతో అక్కడి నుంచి అమీన్ పూర్ లో గల చక్ర పూరి కాలనీలో నిర్మానుష్య ప్రదేశంలో తీసుకొచ్చారు. అక్కడ మద్యం మత్తులో ఉన్న వెంకటప్ప తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు.

కాగా ఏమి తెలియనట్టు భార్య పద్మ 9 తేదీ చందానగర్ పోలీస్ స్టేషన్ లో భర్త అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసింది. హత్య కేసు నమోదు చేసుకున్న అమీన్ పూర్ పోలీసులు సీసీ ఫుటేజ్, మృతుడి భార్య పద్మ వాడిన ఫోన్ ఆధారంగా హత్యకు కారకులైన పద్మ, రెహమాన్, సుభాష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినామని డీఎస్పీ వెల్లడించారు. కేసు చేదనలో అమీన్ పూర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి, అమీన్ పూర్ ఎస్ఐ సోమేశ్వరి, కానిస్టేబుల్ మహేందర్, రాథోడ్ లను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story