- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maruti Suzuki Electric Car: మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ కారు.. టాప్ ప్లేస్‌లో ఉన్న టాటాకు పోటీగా
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకీ. అన్ని కంపెనీల కార్ల కన్నా మారుతి కారు ఎక్కువ సేల్ అవుతుంటాయి. అంతేకాకుండా ప్రజలకు ఈ కారుపై నమ్మకం ఎక్కువ. రీసెంట్ గానే మారుతి సుజుకీ కొత్త డిజైర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
కార్ల అమ్మకాల్లో టాప్‌లో ఉన్న ఇది ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లలో కూడా దూసుకుపోతుంది.అందులో భాగంగానే ఈవీ విటారాను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈవీ అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో ఉన్నటాటాకు పోటీగా రానుంది.
ఈ విరాటాను వచ్చే ఏడాది(2025 ) ఏప్రిల్ లేదా మే నెలలో గుజరాత్‌తోని సుజుకి ఎలక్రిక్ వాహనాల తయారీ కేంద్రంలో ఈ కారు ఉత్పత్తి స్టార్ కానుంది. ఇది స్పెషల్‌గా ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన Hartect-E ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేస్తారు. అలాగే ఈ కారు ఎలక్ట్రిక్ కారు డిజైన్‌కు తగ్గట్టుగా తయారు చేయబడుతుందట. ట్రై-స్లాష్, ఎల్‌ఈడీ హెడ్‌లైడ్లు, ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, వెనక భాగంలో వీల్ ఆర్చ్‌లు ఇలా ఎస్‌యూవీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండనుందట.
18 నుంచి 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో రానుంది. ఈ విరాటా వెడల్పు 1800 మిమీ.. పొడవు 4, 275 మిమీ, ఎత్తు-1635 మిమీ, 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. సెంటర్ కన్సోల్ కోసం కొత్త డిజైన్, వన్-పీస్ డిస్‌ప్లే, వర్టికల్ ఎయిర్ వెంట్స్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ అట్రాక్టివ్‌గా ఉంటాయి.
ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 49 kWh, 61 kWhగా రెండు ఆప్షన్స్‌లో రానుంది. పూర్తి ఛార్జింగ్‌పై 500 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. అలాగే సింగిల్ మోటార్ అయితే 49kWh బ్యాటరీ ప్యాక్ 144 బీహెచ్‌పీ శక్తిని, 189 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.