79 ఏళ్ల వయసులో బిగ్‌బీ రియల్ స్టంట్.. ఫ్యాన్స్ ఫిదా

by Harish |
79 ఏళ్ల వయసులో బిగ్‌బీ రియల్ స్టంట్.. ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ 79 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఆయన తాజా చిత్రం 'ఝండ్' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా.. ఇటీవలే ఓ యాక్షన్-ప్యాక్డ్ కమర్షియల్ యాడ్‌లో రియల్ స్టంట్‌‌తో ఔరా అనిపించాడు. 'ఏ బాడీ డబుల్' అనే ఈ యాడ్‌ను యాక్షన్ డైరెక్టర్ మనోహర్ వర్మ తెరకెక్కించగా.. అమితాబ్ ఇందులో మూడు దృఢమైన గాజు పలకలను గ్రాఫిక్స్ లేకుండా నిజంగానే పగలగొట్టారని మనోహర్ తెలిపాడు. ముందుగా ఈ ఎపిసోడ్‌ను డూప్‌తో చేయించాలని భావించినప్పటికీ అందుకు నిరాకరించిన బిగ్‌బీ.. రియల్ స్టంట్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడని చెప్పాడు. వయసు అనేది నంబర్ మాత్రమేని మరోసారి నిరూపించాడంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అమితాబ్ 'రన్‌వే 34' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా 2022 ఏప్రిల్ 29న ఈ మూవీ విడుదల కానుంది.




Advertisement

Next Story