- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్తత.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు
దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం ఇర్కి చేడు గ్రామంలో గురువారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఒక వర్గం వారు నిప్పంటించారు. గ్రామకంఠం స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య గత కొంత కాలం నుండి వివాదం నడుస్తూ వస్తోంది. ఆ స్థలంలో ఒక వర్గం వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాలను మరో వర్గం వారు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక వర్గం వారు విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రయత్నం చేయగా. మరో వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు విగ్రహం పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో విగ్రహం పైన ఉన్న కవరు మాత్రం కాలింది. కొంతమంది వ్యక్తులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.