టీడీపీ ఎమ్మెల్యేలపై అంబటి రాంబాబు ఆగ్రహం

by Vinod kumar |
టీడీపీ ఎమ్మెల్యేలపై అంబటి రాంబాబు ఆగ్రహం
X

దిశ, ఏపీ బ్యూరో : 'ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్పి.. అదే నిజమని ప్రజలను నమ్మించాలనే దుర్బుద్ధితో ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తోంది.శాసనసభా సంప్రదాయాలను గౌరవించకుండా టీడీపీ సభ్యులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు' అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడారు.


'గవర్నర్‌ ప్రసంగం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సభలో టీడీపీ సభ్యుల తీరు ఏ విధంగా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారు.ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏదో వంక పెట్టుకుని ఇంటి దగ్గర కూర్చున్నాడు.ప్రతిపక్ష సభ్యులు కూడా సభకు వచ్చి గందరగోళం సృష్టించే బదులు ఇంటి దగ్గరే ఉంటే సరిపోయేది కదా అని అంబటి రాంబాబు చురకలంటించారు.సభ సజావుగా జరగనివ్వకుండా సస్పెండ్‌ అయ్యి బయటకొచ్చి స్పీకర్‌ సహకరించడం లేదని,అన్యాయంగా సస్పెండ్‌ చేశారని టీడీపీ స‌భ్యులు మాట్లాడుతున్నారు.


పోడియం, వెల్‌లోకి, స్పీకర్‌ చైర్‌ దగ్గరకు వెళ్లి వేళ్లు చూపిస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారన్నారు.ఇదేనా ప్రతిపక్షాలు ప్రవర్తించాల్సిన తీరు' అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చర్చించకుండా అడ్డగోలుగా మాట్లాడేవారిని సస్పెండ్‌ చేయక మరి ఏం చేస్తారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయారని ప్రతిపక్షం నానా యాగీ చేస్తోందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు.అన్నారు. జంగారెడ్డిగూడెంలోని మరణాలన్నీ సహజ మరణాలని ఆరోగ్యశాఖ మంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో చెప్పినా ప్రతిపక్షం వినిపించుకోకుండా ప్రభుత్వంపై నెపం మోపాలనే దురుద్దేశంతో ప్రవర్తిస్తుంది అని అంబటి రాంబాబు ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed