- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆకురూపంలో అద్భుతమైన సముద్ర చేప..
దిశ, ఫీచర్స్ : సముద్ర గర్భంలోని రహస్య జీవుల జాడ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగిస్తుంటారని తెలిసిందే. ఈ క్రమంలో వింత ఆకారాలు, భారీ పరిమాణాలతో కూడిన వేలాది జీవులను కనుగొనగా.. తాజాగా వైజాగ్ తీరంలో ఒక అరుదైన సముద్ర చేప తొలిసారిగా వెలుగు చూసింది.
ఆకు వంటి ఆకారంతో రక్తనాళాలులేని ఈ జీవి.. లేత, ముదురు నీలి రంగుతో మధ్యలో ఎల్లో కలర్‌లో కనిపిస్తున్న వెన్నుతో చూపరులను ఆకర్షిస్తోంది. 'ఫ్లాట్ వార్మ్'గా పిలువబడే ఈ చేపలు.. ముఖ్యంగా సముద్రపు ఆటుపోట్లు సంభవించే ప్రాంతంలో బయటపడతాయి. దీంతో విశాఖకు చెందిన పరిశోధకులు ప్రతీ రెండు వారాలకోసారి ఆయా ప్రాంతాల్లో మెరైన్ వాక్ చేపడుతున్నారు. ఇందులో ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ ఫ్లాట్‌వార్మ్‌లు ఎక్కువగా చిన్న చిన్న పీతలు, ఇతర జీవులను తింటాయి. ఇవి అత్యంత విషపూరితమైనవి కావడంతోనే పెద్ద పెద్ద జంతువులు ఈ చేపలకు దూరంగా ఉంటాయి.