- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెద్దపల్లి జిల్లాలో భూ వివాదం.. ఆ సర్పంచ్ పై వేటు పడుతుందా..? లేదా రాజీనామా చేస్తాడా..?
దిశ, పెద్దపల్లి : సర్కారు భూమిని ఆక్రమించుకున్న సర్పంచ్‌పై వేటు వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తాను భూమిని ఆక్రమించుకోలేదని సర్పంచ్ ప్రకటించినప్పటికీ.. వాస్తవాలు మాత్రం ఆయన ఆక్రమించినట్టుగానే తేటతెల్లం చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గట్టు సింగారం రెవెన్యూ శివారులో 29, 31, 32, 3z సర్వే నెంబర్లలో సుమారు 6 ఎకరాల 20 గుంటలు ప్రభుత్వ భూమిని సర్పంచ్ చుంచు సదయ్య ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ. కోటి విలువ చేసే భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని సహజ వనరుల పరిరక్షణ సమితి మెంబర్ కందుల అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఏడాది కాలంగా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేస్తున్న ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చొరవ చూపకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. అయితే ఈ భూమి తన సొంతమని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సర్పంచ్ సదయ్య వెల్లడిస్తున్నా.. వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయన్నారు. తాను కబ్జా చేసినట్టుగా నిరూపణ అయితే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని సర్పంచ్ చుంచు సదయ్య ప్రకటించారు. 6 ఎకరాల 20 గుంటల భూమి ప్రభుత్వానిదేనని రెవెన్యూ అధికారులు పంచనామా చేసి ధ్రువీకరించారన్నారు. సర్పంచ్ గతంలో చేసిన ప్రకటన ప్రకారం రాజీనామా చేస్తారా..? లేక ప్రభుత్వమే ఆయనను పదవి నుండి తొలగిస్తుందా లేదా అని కందుల అశోక్ ప్రశ్నించారు.