Nikhil Siddhartha: ‘అనంతం’ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.. నిఖిల్

by Hamsa |   ( Updated:2024-10-27 14:44:18.0  )
Nikhil Siddhartha: ‘అనంతం’ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్.. నిఖిల్
X

దిశ, సినిమా: వెంకట్ శివకుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అనంతం’(Anantham). ఈ చిత్రంలో రుచిత సాధినేని, రామ్ కిషన్, స్నిగ్ధ నయని(Snigdha Nayani), వసంతిక మచ్చ, చైతన్య సగిరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అనంతం’ సినిమాను ఆరుద్ర ప్రొడక్షన్స్ సమర్పణలో విజయ లక్ష్మి, సుధీర్ నిర్మిస్తున్నారు. సాయిచరణ్ రెడ్డి (Sai Charan Reddy)రేకులతో కలిసి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించారు వెంకట శివకుమార్. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ‘అనంతం’(Anantham) చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో నిఖిల్(Nikhil) చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ‘అనంతం’(Anantham) సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుందని చెప్పిన హీరో నిఖిల్, మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Advertisement

Next Story