- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alia Bhatt: అందం కోసం సర్జరీలు చేయించుకుంటే పక్షవాతం వచ్చింది..
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి అలియా భట్(Alia Bhatt)కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై కొందరు ఆమె అందం కోసం సర్జరీలు చేయించుకోవడం వల్ల అలియా(Alia Bhatt)కు పక్షవాతం కూడా వచ్చిందని కామెంట్లు పెట్టారు. తాజాగా, ఈ విషయంపై అలియా భట్(Alia Bhatt) ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ‘‘నాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
ఆ వీడియోలో క్రియేట్ చేసిన వారి దృష్టిలో నా నవ్వు వంకరగా ఉంటుంది. నేను మాట్లాడే విధానం కూడా భిన్నంగా ఉంది. అందం కోసం సర్జరీలు చేయించుకున్నాను. అలాగే వారి దృష్టిలో నాకు పక్షవాతం కూడా వచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి రూమర్స్ నాపై సృష్టించి మీరంతా తమాషాలు చేస్తున్నారా? ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎదుటి వ్యక్తులపై ఇలాంటి కామెంట్స్ చేయడం నేరమని మీకు తెలియదా? కేవలం వ్యూస్ కోసం ఇలా చేయడంలో అర్థం లేదు.
ఇలాంటి కామెంట్స్ చేసే వారిలో మహిళలు కూడా ఉండటం సిగ్గుచేటు. ఈ పద్ధతి ఎప్పటికైనా హానికరమే. నా బాడీ నా ఇష్టం. ఈ విషయం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందం కోసం ప్రికాషన్స్ తీసుకుంటే మీకేం అవసరం. మీరు ఎవరు నన్ను జడ్జ్ చేయడానికి. మీకేం హక్కు ఉందని ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ అలియా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
- Tags
- alia bhatt