మళ్లీ తల్లి కాబోతున్న ఐశ్వర్యా రాయ్.. ఈ సారి మగ బిడ్డ?

by Manoj |   ( Updated:2023-03-28 17:51:50.0  )
మళ్లీ తల్లి కాబోతున్న ఐశ్వర్యా రాయ్.. ఈ సారి మగ బిడ్డ?
X

దిశ, సినిమా : ఐశ్వర్యా రాయ్ బచ్చన్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఐష్ ప్రెగ్నెన్నీపై రూమర్స్ క్రియేట్ అయినప్పటికీ.. ఈ సారి మాత్రం కన్‌ఫర్మ్ అయిందని సమాచారం. ఇటీవల కూతురు ఆరాధ్య, భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వెళ్లే క్రమంలో ఐశ్వర్య పొట్ట ఎత్తుగా కనిపించడం, ఆమె కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియోతో ఈ విషయంలో నిర్ధారణకు వచ్చినట్లు చెప్తున్నారు అభిమానులు.

ఇక ఈ వీడియోలో నల్లటి దుస్తులు వేసుకున్న నటి.. పైన వదులుగా ఉండే పెద్ద బ్లాక్ కోట్ ధరించింది. అంతేకాదు ఆమె నడుస్తున్నప్పుడు తన హావభావాలు, నడకకు సంబంధించిన వీడియోను క్లియర్‌గా అబ్బర్వ్ చేస్తే తను ప్రెగ్నెంట్ కాదని కొట్టిపారేయలేం అంటున్న ఫ్యాన్స్.. జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. ఈ సారి కచ్చితంగా మగ బిడ్డ పుడుతాడని బెట్టింగులు కూడా పెట్టుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed