స్త్రీలపై లైంగిక వేధింపులు ఆగట్లేదు.. :స్టార్ నటి

by Disha News Web Desk |
స్త్రీలపై లైంగిక వేధింపులు ఆగట్లేదు.. :స్టార్ నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి యామీ గౌతమ్ లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలకు మద్దతుగా నిలుస్తోంది. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె.. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు మజ్లిస్, పారి (పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా) అనే రెండు ఎన్‌జీవో‌లతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న మహిళల గురించి ఆలోచించే ధోరణిలో పెద్దగా మార్పులు రావట్లేదని అభిప్రాయపడింది.

'లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచేందుకు రెండు ఎన్‌జీవో‌లతో కలసి పనిచేయడం గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీల భద్రత, సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతో ఉంది. గవర్నమెంట్లు చర్యలు తీసుకుంటున్నా.. మరింత కృషి చేయాల్సి ఉంది. అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి అవసరమైన వసతుల కల్పనకు మరింత సహకారం అందించాలి' అని అభిప్రాయపడింది. అలాగే పసిపాపల నుంచి మొదలుకుని వృద్ధులను కూడా వదలకుండా లైంగికంగా వేధిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

https://www.instagram.com/p/CJLA7NVlmLR/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story