- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పేరెంట్స్ ఆ క్యారెక్టర్లే చేయాలంటున్నారు.. యంగ్ బ్యూటీ
దిశ, సినిమా: 'కొత్త బంగారులోకం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి శ్వేతా బసు ప్రసాద్. ఈ సినిమాలో తన మాటలు, అందంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. చాలా కాలంగా కనిపించకుండా పోయింది. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు తెలిపిన శ్వేతా ప్రస్తుతం వరుస అవకాశాలతో కెరీర్ బిజీగా ఉందంటోంది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. 'అమ్మ నాన్న కూడా సినిమా ప్రపంచానికి అభిమానులే. మంచి పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రోత్సహిస్తుంటారు. వెటరన్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా లను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పాత్రల ఎంపికకు సంబంధించిన ఇంపార్టెన్స్ వాళ్లను చూసి అర్థం చేసుకున్నాను. ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు వచ్చినప్పటికి, నచ్చిన కొన్నింటికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా' అంటూ వివరించింది. అలాగే రీసెంట్‌గా ఓ వెబ్‌సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నానని చెప్పిన నటి.. 'ఇండియా లాక్‌డౌన్' సినిమాతో పాటు పలు షార్ట్ ఫిల్మ్‌ల్లోనూ నటిస్తున్నానని చెప్పింది.