- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నా హృదయం ముక్కలైంది.. అందుకే అలా చేశా.. విల్‌స్మిత్
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ 'విల్ స్మిత్' కమెడియన్ క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టడంపై రియలైజ్ అయినట్లు తెలిపాడు. అంతేకాదు 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్'కు రాజీనామా చేసినట్లు చెప్పిన హీరో.. అతన్ని చెంప దెబ్బ కొట్టడమనేది బాధాకరమైన, క్షమించరాని పొరపాటుగా పేర్కొన్నాడు. 'నేను అకాడమీ నమ్మకానికి ద్రోహం చేశాను. అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఇతర నామినీలు, విజేతలు ఈ వేడుకను సంతోషంగా జరుపుకునే అవకాశాన్ని కోల్పోయేలా చేశాను. నా హృదయం ముక్కలైంది. అకాడమీ అవార్డ్స్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే. తదుపరి పరిణామాలను అంగీకరిస్తాను' అంటూ వివరించాడు. అలాగే ఎవరైనా మారడానికి కొద్దిగా సమయం పడుతుందని, హింసను అనుమతించకుండా అందుకు కారణమయ్యే పరిస్థితులను అధిగమించేలా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. ఇక విల్ స్మిత్ రాజీనామాను ఆమోదించినట్లు అకాడమీ అవార్డ్స్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ తెలుపగా.. క్రమశిక్షణా చర్యలో భాగంగా అదనపు ఆంక్షలు కొనసాగిస్తామని వెల్లడించారు.
#WillSmith resigns from the #Academy for slapping #ChrisRock at the #Oscars
— Ramesh Bala (@rameshlaus) April 2, 2022
His statement pic.twitter.com/3sDhcAkDuZ