బ్రేకింగ్: కేంద్రీయ విద్యాలయం సంచలన నిర్ణయం.. ఇకపై ఆ కోటా రద్దు

by Satheesh |   ( Updated:2022-04-13 11:54:24.0  )
బ్రేకింగ్: కేంద్రీయ విద్యాలయం సంచలన నిర్ణయం.. ఇకపై ఆ కోటా రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రీయ విద్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రవేశాల్లో ఉన్న ఎంపీ కోటా రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్రీయ విద్యాలయం జారీచేసింది. అయితే కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా కింద ఇప్పటి వరకు 10సీట్లు ఉండేవి. తాజా నిర్ణయంతో ఇకపై ఈ సీట్లు ఉండవు. కాగా, కేంద్రీయ విద్యాలయ ప్రవేశాల్లో ఎంపీ కోటా దుర్వినియోగం అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రవేశాల్లో విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Next Story