సీఎస్ సమీర్ శర్మకు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ..

by Satheesh |
సీఎస్ సమీర్ శర్మకు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ..
X

దిశ, ఏపీ బ్యూరో: నాపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ముగిసింది. ఇంకా సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సస్పెన్షన్‌కు 2022 ఫిబ్రవరి 8తో రెండేళ్లు నిండిన కారణంగా రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా తొలగి పోయినట్లే' అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. సర్వీస్ రూల్స్ ప్రకారం సస్పెన్షన్ తొలగినందున నా పూర్తి జీతం వెంటనే ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. నా సస్పెన్షన్‌కు ఆరేసి నెలల వంతున ఇచ్చిన పొడిగింపు జనవరి 27 తోనే ముగిసిందని తెలిపారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ను కొనసాగించాలంటే.. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పని సరి అని గుర్తు చేశారు. గడువులోగా రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోలేదు కాబట్టి.. సస్పెన్షన్ ముగిసినట్లేనని వెల్లడించారు. 31.7.2021న చివరిసారిగా నా సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఇచ్చిన జీఓను రహస్యంగా ఉంచారు. నాకు కాపీ ఇవ్వలేదు. ఏమైనప్పటికీ.. ఫిబ్రవరి 8తో నా సస్పెన్షన్ ముగిసింది' అని సీఎస్‌కు రాసిన లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed