- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుని దయవల్ల బతికిపోయాం.. ఆ రోజు పరిస్థితి ఊహించలేనన్న అమీర్
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత 'లాల్ సింగ్ చద్దా' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కాగా ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుండగా ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నాడు అమీర్. ఈ క్రమంలోనే 'కెజియఫ్-2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిందీ ప్రేక్షకులతో సహా తన స్నేహితులు కూడా ఎంతోమంది 'కెజియఫ్-2' కోసం ఆసక్తిగా ఎదురు చూశారని తెలిపాడు. ఈ మేరకు 'ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 'కెజియఫ్-2', 'లాల్ సింగ్ చద్దా' ఒకే రోజు విడుదల కావాలి. కానీ, దేవుని దయ వల్ల రెడ్ చిల్లీస్ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్‌ను ఆలస్యం చేసింది. అందువల్ల మా సినిమాను విడుదల చేయలేక బతికిపోయాం. లేకపోతే ఆ సినిమా దూకుడు ముందు మా సినిమా పరిస్థితేంటో ఊహించలేం' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 'లాల్ సింగ్ చద్దా'లో టాలీవుడ్ హీరో నాగచైతన్య, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు.