- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సులో ఫ్రీగా జర్నీ చేద్దామని అమ్మాయిలా మారిన యువకుడు.. తీరా కండక్టర్‌కు దొరకేసరికీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే టికెట్ తీసుకోవాల్సిందే. మరీ ఆ టికెట్ నుంచి తప్పించుకునేందుకు కొందరు నగరం లోని సిటీ బస్సుల్లో స్టూడెంట్ పాస్ అంటూ ఫ్రీగా జర్నీ చేస్తుంటారు. అయితే, ఢిల్లీలో ఓ ప్రయాణికుడు చేసిన పనికి దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయాడు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్నిచ్చింది. అయితే, మహిళలకు కల్పించిన ఈ వెసులుబాటును ఉపయోగించుకుని ఓ యువకుడు ఫ్రీగా బస్సులో ప్రయాణించేందుకు ప్లాన్ వేసి దొరికిపోయాడు.
ఓ యువకుడు లేడీ గెటప్‌తో స్కార్ఫ్, మాస్కులతో యువతిలా బస్సు ఎక్కాడు. గెటప్ మార్చేసిన యువకుడు.. కండక్టర్ వద్ద మేనేజ్ చేయడంలో విఫలమయ్యాడు. అంతే.. కండక్టర్‌కు అనుమానం రావడంతో.. మాస్క్ తీయాలని అడగ్గా.. కొంతసేపు గొడవ చేసి చివరికి మాస్క్ తీశాడు. అయితే, కండక్టర్ వద్ద దొరికిన పోయినప్పటికీ అమ్మాయిలా గొంతు మార్చాడు. ఈ తతంగాన్ని వీడియో తీసిన కండక్టర్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో వైరల్ అయ్యింది.