- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబులెన్స్‌ను వెంటాడిన గుర్రం.. అన్న ప్రేమ అంటే ఇదే..
దిశ, వెబ్‌డెస్క్: జంతువులు అనగానే వాటిని బంధాలు, ప్రేమ అనేవి ఉండవని, కొన్నాళ్లకే అవి అంతా మరిచిపోతాయని చాలా మంది చెబుతుంటారు. కానీ తాజాగా నెట్టింట వచ్చిన ఓ వీడియో అలాంటి వారి నోరు మూయిస్తోంది. ఓ గుర్రం తన సోదరి కోసం పడిన తాపత్రం యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఈ వీడియోలో గుర్రం ఓ అంబులెన్స్‌ను వెంటాడుతూ కనిపిస్తోంది. కొన్ని క్షణాలు మాత్రమే ఉన్న ఈ వీడియో చూసి ఇందులో ఏముంది అనుకోవచ్చు.
కానీ నిజానికి ఆ గుర్రం దాదాపు 8.1 కిలోమీటర్ల పాటు ఆ అంబులెన్స్‌ను వెంటాడింది. ఎందుకూ అంటే.. ఆ అంబులెన్స్‌లో తన చెల్లిని తీసుకెళుతున్నారు. రెండో గుర్రానికి అనారోగ్యం రావడంతో ఉదయ్ పూర్‌లోని పశువైద్యశాలకు తీసుకెళుతున్నారు. తన చెల్లికి ఏమవుతుందో అని అనుకున్న అన్న గుర్రం అంబులెన్స్‌ను హాస్పిటల్ వరకు వెంటాడింది. అయితే హాస్పిటల్ వారు రెండు గుర్రాలను ఒకే చోట ఉంచారు.
చెల్లి గుర్రం కోలుకునే వరకు కూడా రెండింటినీ ఒకే చోట ఉంచారు. అయితే అంబులెన్స్‌ను గుర్రం చేజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి అన్న ప్రేమ అంటే అలా ఉంటుంది, జంతువులు ప్రేమ జంతువుల ప్రేమ అంతే అంటూ నెటిజన్లు కామెంట్టు చేస్తున్నారు.
This horse ran behind the ambulance taking his sick sister to the veterinary hospital in Udaipur, India. Hospital kept both of them together until the mare recovered. And we think animals have lesser feelings than us …(Via Channa Prakash) pic.twitter.com/sgV11DAglE— Susanta Nanda IFS (@susantananda3) April 2, 2022
- Tags
- viral video
- horse