- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
15 ఏళ్ల అబ్బాయికి రూ. 33 లక్షల జాబ్.. ఈ కారణంగా కోల్పోయాడు!
దిశ, ఫీచర్స్ : నాగపూర్, వథోడాలోని నారాయణ ఇ-టెక్నో స్కూల్‌లో చదువుతున్న వేదాంత్ యూఎస్ కంపెనీ నుంచి భారీ ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్ అందుకున్నాడు. వేదాంత్ ఇటీవల తన తల్లి ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ చూస్తుండగా.. వెబ్‌సైట్ డిజైన్ కాంపిటీషన్‌కు సంబంధించిన లింక్ కనిపించడంతో అందులో పాల్గొనాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు రెండు రోజుల వ్యవధిలో దాదాపు 2 వేలకు పైగా కోడ్స్ ఎంటర్ చేసి వెయ్యి మందిలో ఒకడిగా విజయం సాధించాడు. దీంతో న్యూజెర్సీకి చెందిన సదరు సంస్థ ఆ అబ్బాయికి ఏడాదికి రూ. 33 లక్షల జీతం ఆఫర్ చేస్తూ తమ HRD టీమ్‌లో చేరాలని ఆహ్వానించింది. కానీ వేదాంత్ వయసు 15 ఏళ్లని తెలియడంతో ఆ తర్వాత ఆఫర్‌ను ఉపసంహరించుకుంది.
అయితే ఈ అవకాశం చేజారడం పట్ల నిరాశ చెందవద్దని వేదాంత్‌కు తెలిపిన కంపెనీ.. స్టడీ పూర్తయిన తర్వాత తమను సంప్రదించమని కోరింది. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయిన వేదాంత్ తల్లిదండ్రులకు ఈ ఆఫర్ గురించి తెలియజేయడంతో తనకు ఒక కొత్త ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డారు. ఇదిలా ఉంటే.. గతంలో వేదాంత్ తను చదువుతున్న పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో రాడార్ సిస్టమ్ మోడల్‌ను రూపొందించడం ద్వారా గోల్డ్ మెడల్ గెలుచుకోవడం విశేషం.