ఆనందం ఒక్కరికేనా..? సెక్స్ లైఫ్‌, ఉద్వేగానికి ఎక్స్‌పర్ట్స్ చిట్కాలు

by sudharani |   ( Updated:2022-08-02 15:35:04.0  )
ఆనందం ఒక్కరికేనా..? సెక్స్ లైఫ్‌, ఉద్వేగానికి ఎక్స్‌పర్ట్స్ చిట్కాలు
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో చిటపట చినుకుల ప్రశాంత దృశ్యం శృంగార భావనలను తట్టిలేపుతుంది. ప్రియమైన వ్యక్తితో సన్నిహితంగా, దగ్గరగా మెలిగేందుకు ఆహ్వానిస్తుంది. ఈ సమయంలో పార్ట్‌నర్స్ మధ్య దోబూచులాడే రొమాంటిక్ గెశ్చర్స్ సెక్స్‌కు ప్రేరిపిస్తాయి. కానీ అది ఇద్దరిలో భావప్రాప్తికి హామీ ఇవ్వగలదా? అంటే సందేహించాల్సిందే! నిజానికి ప్రేమ ఆనందాన్ని ఇస్తే.. భావప్రాప్తి ఆ ఫీలింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది. వివిధ అధ్యయనాల ప్రకారం, మెరుగైన సెక్స్ జీవితం.. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ భావప్రాప్తిలో హెచ్చు తగ్గుల కారణంగా ఈ తరం జంటలు సమానంగా ఆనందాన్ని పొందడం లేదు. కాబట్టి సెక్స్ జీవితం మెరుగుపడాలంటే భావప్రాప్తిని ఎలా చేరుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకోసం సెక్సువల్ హెల్త్ ఎక్స్‌పర్ట్ చెబుతున్న సలహాలేంటో చూద్దాం.

మనస్ఫూర్తిగా పాల్గొనడం ముఖ్యం : సెక్స్ అనేది శారీరకంగా, మానసికంగా అవసరమైన చర్య. కాబట్టి దీన్ని రోజువారీ జీవితంలో సాధారణ కార్యకలాపంగా చూడకూడదు. పూర్తి ఆసక్తిని ప్రదర్శించాలి. ప్రత్యేకించి భాగస్వామితో సమానంగా మీ కోరికలను కూడా నెరవేర్చుకోవడం ఒక ప్రాథమిక అవసరం. ఎందుకుంటే రతిక్రీడలో ఇద్దరికీ సమాన ఆనందాన్ని పొందే హక్కు ఉంది. ఈ విషయంలో మహిళలు తరచూ తమ సొంత అవసరాలు, ఆనందాలను విస్మరిస్తారు. నకిలీ భావప్రాప్తి అంశం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉండేందుకు ఇదే కారణం. అయితే దాన్ని పొందగలిగే వీలున్నప్పుడు నటించాల్సిన అవసరం లేదనేది నిపుణులు చెబుతున్నారు. ఒక స్త్రీ తన అవసరానికి మించి భాగస్వామిని చూసుకోవడం ప్రారంభించినప్పుడు.. ఎక్కడో ఒకచోట ఆమె తన ఆనందాన్ని వదిలేయడం ప్రారంభిస్తుందనేది వారి వాదన.

వ్యక్తిగత ప్రాముఖ్యత అవసరం : భాగస్వాములు ఇద్దరూ ఒకరి అవసరాలను మరొకరు తీర్చడం చాలా ముఖ్యం. ముఖ్యంగా శృంగార ప్రక్రియలో స్త్రీలు తమకు ఎలాంటి పాత్ర లేనట్లుగా అంతా పార్ట్‌నర్‌కు వదిలేయొద్దని ఆన్‌లైన్ సెక్స్ కోచ్ చెబుతున్నారు. ఈ మోడ్రన్ ఎరాలో మహిళలకు తమ అవసరాలు, కోరికలేంటో బాగా తెలుసు. కాబట్టి భాగస్వామిని మాత్రమే సంతోషపెట్టాలనే ఆలోచన వదిలించుకోవాలని సూచిస్తున్నారు. కానీ భాగస్వామికి మీ భావప్రాప్తి కూడా ముఖ్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ముడుచుపోకుండా చేతులు, శరీరాన్ని కదలించడం, ఇద్దరికీ అనువైన వాతావరణాన్ని సృష్టించడం వంటివి శృంగారంలో సంకోచాన్ని తొలగిస్తాయి. ఈ మేరకు 'వైల్డ్ సెడక్షన్'గా పిలువబడే 'రోల్ ప్లే టిప్' ద్వారా తమను తామే ఉద్రేకపరుచుకోవడం ద్వారా భాగస్వామిని సులభంగా ఆకర్షించవచ్చని వివరించారు.

మెరుగైన సెక్స్ లైఫ్, భావప్రాప్తికి చిట్కాలు :

* లొకేషన్ చేంజ్: సెక్స్ లొకేషన్‌ను మార్చుకోవడం వల్ల ఉత్సాహం పెరిగి హెల్తీ సెక్స్‌లో స్పైసీనెస్ పెరుగుతుంది. కిచెన్ టేబుల్, లాండ్రీ రూమ్, కారులో లేదా బయట కూడా ప్రయత్నించవచ్చు. కొత్త ప్రాంతాల్లో సెక్స్ చేయడం రోల్ ప్లే కోసం మరింత ఆహ్లాదకరమైన, సృజనాత్మక అవకాశాలను అందిస్తుంది. ఇది బోరింగ్ సెక్స్ జీవితంలో కొత్త స్పార్క్‌ వెలిగిస్తుంది.

* ముద్దు: శృంగార సమయంలో కలిగే ఉత్సాహం, పొజిషనింగ్ కంఫర్ట్ కారణంగా కొన్నిసార్లు భాగస్వామిని ముద్దుపెట్టుకునే అవకాశాన్ని కోల్పోతారు. కానీ ముద్దు పెట్టుకోవడమే చాలా ముఖ్యం. ప్రత్యేకించి భాగస్వామి శరీరంలోని రహస్య ప్రదేశాల్లో వారికి ఆనందకర అనుభూతి కలిగించే ఈ స్పర్శలు కొత్త ఉత్సాహాన్ని సృష్టిస్తాయి.

* సెన్స్ ఆఫ్ హ్యూమర్: సెన్స్ ఆఫ్ హ్యూమర్.. జీవితంలో ఎలాంటి ఒత్తిడిని అయినా తొలగించగలదు. అదే విషయం సెక్స్‌కు కూడా వర్తిస్తుంది. ఈ సమయంలో చేసే చిన్న చిన్న చిలిపి పనులు భాగస్వాములు ఇద్దరినీ సౌకర్యవంతంగా ఉంచుతాయి. సరైన మార్గంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచి కార్యాన్ని కలర్‌ఫుల్‌గా మారుస్తాయి.

* గుర్తుంచుకోండి.. మీరు రోబో కాదు పార్ట్‌నర్! పరిశోధన ప్రకారం, పురుషులు సాధారణంగా సెక్స్‌ను సమానంగా ఆస్వాదించే మహిళలతో సంబంధాలనే ఇష్టపడతారు. ఇక్కడ శృంగారంలో చురుగ్గా పాల్గొనడమంటే భావప్రాప్తిని సాధించేందుకు ప్రయత్నించడం. మీ తుంటి, హామ్ స్ట్రింగ్స్ (తొడ ఎముక నుంచి వెన్నెముక వరకు ఉండే కండరాలు)‌ను బెండ్ చేయడం, భాగస్వామి చర్యకు ప్రతిచర్య ద్వారా స్పందించడం కూడా సెక్స్ పట్ల ఆసక్తిని చూపుతుంది. ముఖ్యంగా స్త్రీలు తాము సెక్స్ టాయ్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే కచ్చితంగా భాగస్వామితో సమానంగా ప్రతిచర్యలు ఉండాలి.

* సెక్స్ టాక్: భాగస్వాములు తమ కోరికలను ఒకరికొకరు తెలియజేసుకోవాలి. పార్ట్‌నర్‌ను ఎలా స్పర్శించాలనుకుంటున్నారో వారికి కచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పరస్పర చర్య ఇద్దరిలో భావప్రాప్తి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇక డర్టీ టాక్స్ అనేవి ఇద్దరి మధ్య శృంగారాన్ని సౌకర్యవంతంగా మార్చేస్తాయి. అంటే కమ్యూనికేషనే సెక్స్‌లో 'కీ' లాంటిది.

* తెలుసుకుని ఆస్వాదించాలి..

కొంతమంది కపుల్స్ కఠినమైన సెక్స్‌ను ఆనందిస్తారు. కానీ అలాంటి ప్రయోగాలు చేసే ముందు భాగస్వామితో మాట్లాడటం తెలివైన పని. ఎందుకంటే భాగస్వామికి ఆ విధానం ఇష్టముందో లేదో తెలియకుండా వారితో కఠినంగా ప్రవర్తిస్తే అది లైంగిక జీవితాన్ని మెరుగుపరచకుండా భాగస్వామికి హాని కలిగించవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి : అండర్‌వేర్.. అంతకుమించి వాడితే యోని ఆరోగ్యంపై ప్రభావం

Advertisement

Next Story