- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బోర్‌డమ్‌కు చెప్పండి గుడ్‌బై.. ‘బిగ్‌బాస్ సీజన్ 5’ హోస్ట్ కన్‌ఫర్మ్
దిశ, సినిమా : నాలుగు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. ‘సీజన్ 5’కు సిద్ధమైంది. ఈ మేరకు అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌తో ముందుకొచ్చింది ‘స్టార్ మా’. బిగ్ బాస్ ఫస్ట్, సెకండ్ సీజన్లను ఎన్టీఆర్, నాని హోస్ట్‌గా చేయగా.. 3, 4 సీజన్లను కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సీజన్ 5ను ఎవరు నడిపించనున్నారనే విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఇక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కంటెస్టెంట్స్ లిస్టు.. రాబోయే సీజన్‌పై ఆసక్తి కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో సీజన్ 5 త్వరలోనే ప్రారంభం కానుందని స్పష్టతనిచ్చిన స్టార్ మా.. హోస్ట్ ఎవరనే విషయాన్నీ కన్‌ఫర్మ్ చేసింది. కింగ్ నాగార్జునతోనే ఈ ప్రోమో రూపొందించగా.. సీజన్ 4 తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ లేక, బోర్‌గా ఫీలవుతున్న ప్రేక్షకులకు ఉత్సాహాన్నిచ్చే ప్రయత్నం చేసింది. ఇక ప్రోమో చివరల్లో ‘బోర్‌డమ్‌కు చెప్పండి గుడ్‌బై.. వచ్చేసింది తెలుగు బిగ్ బాస్ సీజన్ 5’ అనే డైలాగ్‌తో షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు నాగార్జున.
Loading the gun of non stop entertainment. ఇక freedom from boredom.!!#BiggBossTelugu5 @StarMaa
My Bigg Boss colleagues @BeingSalmanKhan @ikamalhaasan @Mohanlal @KicchaSudeep @karanjohar 👉 https://t.co/KsRhteM7oO— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 14, 2021