- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇవి కేసీఆర్‌ను నమ్మే రోజులు కావు: YS షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత దూరం పెట్టారన్నారు. మళ్లీ ఎన్నికలు రాగానే.. దళిత సీఎం నినాదం ఎత్తుకుంటున్నారని దుయ్యబట్టారు. అవసరానికి మాత్రమే కేసీఆర్ నోట మళ్లీ సీఎం మాట వస్తుందని, వారి ఓట్లు అవసరమైతే గానీ దొరకు పదేండ్ల కింద ఇచ్చిన మాట గుర్తుకురాలేదని ఆమె చురకలంటించారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో దొంగ మాటలు చెప్పి మోసం చేశారని ఆమె ఫైరయ్యారు. స్వరాష్ట్రంలో రెండు సార్లు పీఠమెక్కి దళిత సీఎం అని ఏనాడూ అనలేదని, దళితులను అవమానించారని ధ్వజమెత్తారు. కనీసం రెండో దఫా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వకుండా దళిత సమాజాన్ని కించపరిచారన్నారు. దళిత వ్యక్తి పక్కన కూర్చుంటే పక్కకు నెట్టిన నీచ సంస్కృతి కేసీఆర్‌దని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పదేళ్ల పాలనలో దళితులపై లాఠీలు ఝుళిపించిన ఘనత, దళిత మహిళలను లాకప్ డెత్ చేయించిన నియంత పాలన కేసీఆర్‌దని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా దళిత ముఖ్యమంత్రిపై మాట మార్చిన దొర.. సమయం వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తానని చెప్పటం కొత్త కుట్రకు నిదర్శనమని ఆమె చెప్పుకొచ్చారు. నిజంగా దళిత బిడ్డను సీఎం చేయాలనుకుంటే దానికి ఇప్పుడు సమయం లేదా అని షర్మిల ప్రశ్నించారు. అర్హత కలిగిన దళిత నాయకులు లేరా అని ఆమె నిలదీశారు. ఒకపక్క కొడుకును సీఎం చేసేందుకు మోడీతో తెరచాటు ఒప్పందాలు చేసుకుంటూ.. అవసరం వచ్చినప్పుడు దళిత సీఎం అంటే నమ్మే రోజులు కావని, ఈవిషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. నిజంగా దళితులపై ప్రేముంటే ఎన్నికల ముందే దళిత ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని, లేదంటే ఈ డ్రామాలన్నీ ఎన్నికల కోసమే అని ఒప్పుకోవాలని షర్మిల ఫైరయ్యారు.
Read More..