- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ycp Vs Janasena: శాసనమండలిలో రన్నింగ్ కామెంట్రీ.. గందరగోళం
దిశ, వెబ్ డెస్క్: శాసనమండలి(Legislative Council)లో రన్నింగ్ కామెంట్రీతో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై వైసీపీ, టీడీపీ(YCP and TDP) ఎమ్మెల్సీలు మధ్య మాటలయుద్ధం సాగింది. రుషికొండ భవనాల(Rushikonda Buildings) విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. రుషికొండ భవనాల స్థానంలో గతంలో హరిత రిసార్ట్స్(Green Resorts) ఉండేదని, దాని వల్ల ప్రభుత్వానికి మంచి ఆదయం వచ్చేదని, అయినా వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిందని మంత్రులు కందుల దుర్గేశ్(Ministers Kandula Durgesh) గుర్తు చేశారు. అసలు ఆ స్థలంలో ఏం కడుతున్నారో.. ఎందుకు కడుతున్నారో కూడా గత ప్రభుత్వం చెప్పలేదని మండిపడ్డారు. ఆ తర్వాత రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండ భవనాలు కట్టిన విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. రుషికొండ భవనాలను ప్రజల కోసం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Chief Minister Jagan Mohan Reddy) కోసమే నిర్మించారని వ్యాఖ్యానించారు.
ఇందుకు వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు. రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే విచారణ చేయండని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు. రుషికొండ భవనాలను సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పరిశీలించి అద్భుతంగా కట్టారని తెలిపిన విషయాన్ని శాసనమండలిలో బొత్స గుర్తు చేశారు. రుషికొండ భవనాలు ప్రభుత్వానిదని, ఎంత ఖర్చు చేశామో వాటన్నింటి లెక్కలు ఉన్నాయని, అవకతవకలు జరిగితే విచారణ చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ఈ సమయంలో కొందరు టీడీపీ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేశారు. దీంతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది.