- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆడబిడ్డకు కష్టం రావొద్దు.. కవిత ఈడీ నోటీసులపై విజయశాంతి షాకింగ్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసుల వ్యవహారంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. కవిత అరెస్ట్ కావాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా తమకు, తమ పార్టీకి లేదని అన్నారు. కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అయినట్లు కాదని వెల్లడించారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వాటి విధులు అవి నిర్వర్తిస్తాయని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రచారం జరుగుతుండటంతో తమకు వ్యతిరేకంగా ఓటు పడుతుందేమో అనే భయం బీఆర్ఎస్‌లో ఉందేమో కానీ, జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదని అభిప్రాయప్డడారు. ‘ఇక, ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు... ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటాది’ అని ట్విట్టర్‌లో విజయశాంతి పేర్కొన్నారు.