- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేము దాడులే చేయాలనుకుంటే మీరు రోడెక్కరు: Revanth Reddy
దిశ, డైనమిక్ /మహబూబ్ నగర్ బ్యూరో/కొల్లాపూర్: రాబోయే ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీ కథానాయకులు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొల్లాపూర్ ప్రజాభేరి సభలో రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే మరో లక్ష కోట్లు దోచుకుంటారని అందువల్ల ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. దుబ్బాక ఘటనపై బీఆర్ఎర్ చిల్లర ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. నిజంగా కాంగ్రెస్ వాళ్లు దాడులు చేయదల్చుకుంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ రోడ్డు ఎక్కరు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర త్యాగాల చరిత్ర అన్నారు. తెలంగాణలో ప్రజల సర్కార్ వస్తుందని అంతా కలలు కంటే దొరల తెలంగాణ వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు దొరల తెలంగాణకు తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే లక్ష కోట్లు దోచుకున్నారని తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసే పని చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ గెలవకూడదని బీఆర్ఎస్, బీజేపీ కుట్రపూరితంగా లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మరోవైపు బీజేపీకి అవసరమైనప్పుపడల్లా ఎంఐఎం సహకరిస్తున్నదన్నారు.
పాలమూరు పౌరుషానికి కేసీఆర్ అహంకారానికి పోటీ: జూపల్లి కృష్ణారావు
జరగబోయే ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి, అవినీతికి జరగబోయే ఎన్నిక అని కాంగ్రెస్ నేత, కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్ అని కేసీఆర్ అన్నట్లు గుర్తు చేశారు. మరి డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ ఎక్కడ పోయాయ్ అని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి ఆకాశాన్ని అంటిందని, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయిందని విమర్శించారు. తెలంగాణలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే.. చలించి, పెద్ద మనసుతో సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో అవినీతి రహిత రాష్ట్రం ఉండాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అత్త సోమ్మును అల్లుడు దానం చేసినట్లుగా ప్రభుత్వ సోమ్మును లూటీ చేశారని అన్నారు.
Also Read..