- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
దిశ,కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మండల ఎం ఈ ఓ లోకిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి సంయుక్తంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పదవ పరీక్షల పట్ల అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ సదస్సు కు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,డీఈఓ కే.రాము హాజరయ్యారు.ఈ సందర్భంగా మొదటగా డీఈఓ కే. రాము మాట్లాడుతూ మేము పదవ తరగతి విద్యార్థుల కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి కోరగానే విచ్చేసిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు జీపీఏ లో 101/10 సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అలాగే విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు బోధించే విషయాల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు.
తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయవద్దు.. అలాగే వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దు: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు.అలాగే ప్రతి విద్యార్థి జీపీఏ లో 101/10 సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు.విద్యార్థులకు పదవ తరగతి అనేది మొదటి మైలు రాయి,మొదటి మెట్టని కొనియాడారు. గతంలో 10/10 సాధించిన విద్యార్థులకు రవీంద్రభారతి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం చేశామని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా విద్యార్థులు సన్మానం పొందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ. శంకర్,ఎం ఈ ఓ లోకిని శ్రీనివాస్,ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పీసీసీ కార్యదర్శి తోట్ల అంజయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితీ నాగరాజు, బ్లాక్ అధ్యక్షులు ఎండి. అజీమ్, ప్రధాన కార్యదర్శి జవ్వాజి రవీందర్,ఏఎంసీ చైర్మన్ పుండ్ర నారాయణ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెల్చాల సత్యనారాయణ, బైరా దేవా,పులి హరిప్రసాద్,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.