- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: కాంగ్రెస్ గుండాయిజానికి బీజేపీ బెదరదు.. రాజ్యసభ ఎంపీ కే. లక్ష్మణ్
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్(Congress) గూండాయిజానికి బీజేపీ(BJP) బెదరదు అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే. లక్ష్మణ్(MP K Lakshman) అన్నారు. ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(AICC Leader Priyanka Gandhi)పై ఢిల్లీ బీజేపీ నేత(Delhi BJP Leader) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజ్యసభ ఎంపీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు మా కార్యకర్తలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇలాంటి గూండాయిజం బీజేపీ కార్యకర్తలకు భయం కలిగించదని తెలిపారు. ఈ అవమానకర చర్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.