- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Video Viral: నీ ధైర్యానికి సలాం.. చిరుతకే చుక్కలు చూపించాడుగా!!
దిశ,వెబ్‌డెస్క్: చిరుత పులి అంటే ఎవరైనా సరే భయపడాల్సిందే. ఇక దాన్ని దూరం నుంచి చూస్తేనే భయపడిపోతారు. వెంటనే అక్కడి నుంచి పరుగు తీస్తారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం చిరుతను చూసి పరిగెత్తకుండా దాని తోకను పట్టుకుని చుక్కలు చూపించాడు. ఈ ఘటన కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రంగపుర గ్రామంలోని 5రోజులుగా చిరుత గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. చిరుత(Cheetah)ని చూసిన గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోనులో చిరుతను బంధించేందుకు ప్రయత్నించారు.
కానీ.. ఆ చిరుత తప్పించుకోవాలని చూసింది. ఈ తరుణంలో అదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు చిరుత పులి తోకను పట్టుకుని, అది పారిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అధికారులు వల సాయంతో చిరుతను బంధించారు. ఈ క్రమంలో చిరుతను బోనులో వేసి అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన ఆ యువకుడిని గ్రామస్థులు, అధికారులు అభినందించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో యువకుడి సాహసం, ధైర్యాన్ని చూసినా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Indeed, a filmy capture of a leopard in Karnataka. pic.twitter.com/0tKtRqKlFF
— Ajay Kumar (@ajay_kumar31) January 7, 2025