Gurukula Notification : సోషల్ వెల్ఫర్ గురుకుల విద్యాలయ సంస్థలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

by Y. Venkata Narasimha Reddy |
Gurukula Notification : సోషల్ వెల్ఫర్ గురుకుల విద్యాలయ సంస్థలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ, వెడ్ డెస్క్ : తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TGSWREIS)లో 65 ఐటీ ఇన్ స్ట్రక్టర్, ఇద్దరు పీఆర్ఓ పోస్టులను భర్తీ(Filling of Posts Notification) చేయడానికి నేటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటించింది. ఐటీ ఇన్ స్ట్రక్టర్ పోస్టులకు ఎంటెక్, బీటెక్, ఎంసీఏ లలో కంప్యూటర్స్ పూర్తి చేసిన వారు, పీఆర్ఓ పోస్టులకు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాకాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ పోస్టులకు ఆసక్తి చూపే అభ్యర్థులు ఈనెల 10 వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా మాసబ్ ట్యాంక్ లోని దేశోద్ధారక భవన్ తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తుఫారాలను పొంది అప్లై చేయాలని, మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సంస్థ నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story