ఇ ఇద్దరి వల్ల కేసీఆర్ ఎంతో నష్టపోయారు.. ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఇ ఇద్దరి వల్ల కేసీఆర్ ఎంతో నష్టపోయారు.. ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలన, కేసీఆర్ కుటుంబం(KCR Family)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను పదేళ్ల పాటు కేసీఆర్(KCR) కుటుంబం దోచుకున్నదని ఆరోపించారు. విచారణ అధికారుల ముందు కేటీఆర్(KTR), కవిత(Kavitha) డిమాండ్లు పెడుతున్నారని విమర్శించారు. కొడుకు, కూతురు మూలంగా కేసీఆర్ ఎంతో నష్టపోయారని.. వెంటనే వారిని అదుపులో పెట్టకపోతే సర్వం కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన అందరూ శిక్షార్హులే అని.. కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.

అంతేకాదు.. ఫార్ములా ఈ- రేస్‌ కేసు(F-1 Case)లో కేటీఆర్‌ చేసింది దొంగతనమని, పైగా న్యాయవాదులు లేకపోతే విచారణకు వెళ్లనని తమాషా చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెల్లె కవితనేమో ఈడీ ఇంటికే రావాలని, ఏసీ కిందే విచారణ జరపాలంటూ కోరారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, ముఖ్యమంత్రి, మంత్రి అనే భ్రమలోంచి బయటకు రావాలన్నారు. తమాషాలు మాని ఏసీబీ దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్‌కు అర్వింద్‌ నిన్న మండిపడ్డారు.

Advertisement

Next Story