- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ పనులు చేయకూడదు.. ఈసీ నిబంధనలు ఇవే..
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ఈసీ విడుదల చేయడంతో నిన్నటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కూడా మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతీ ఎన్నికల్లోనూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి నిబంధనలు ఉంటాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ పథకాలు, పనులు, ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభించడానికి వీలు పడదు. ఇంతకుముందు ప్రారంభించిన పనులను కొనసాగించుకోవచ్చు. అలాగే అధికార పార్టీ ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చుకోవడానికి అవకాశం ఉండదు. ప్రభుత్వ వెబ్ సైట్లలో ఉన్న ప్రకటలను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు అభివృద్ది పనుల కోసం నిధులు విడుదల చేయడానికి వీలు పడదు. ఇక కోడ్ అమల్లోకి ఉండగా ఎవరికీ గన్ లైసెన్స్ ఇవ్వరు.
అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించడం, బీపీఎల్ కుటుంబాలకు ఎల్లో కార్డులు జారీ చేయడం లాంటివి ప్రభుత్వాలు చేయడానికి అవకాశం ఉండటం. ఇక ప్రభుత్వ నిధులతో పార్టీ నేతలు తమ ఇంటి వద్ద కార్యక్రమాలు చేయకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈసీ పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల కౌంటింగ్ ముగిసేవరకు కోడ్ అమల్లో ఉంటుంది.