- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక అందరి దృష్టి ఈటలపైనే.. ఇవాళ మీడియా ముందుకు భార్య జమున!
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పొలిటికల్ డైలమా కంటిన్యూ అవుతూనే ఉన్నది. బీజేపీలో కొనసాగుతారా లేక మరో పార్టీలోకి వెళ్లిపోతారా అనే ఊహాగానాలూ ఆగడంలేదు. చొక్కాలు మార్చుకున్నంత ఈజీగా పార్టీ మారలేను.. చిల్లరగాళ్ల తరహాలో వ్యవహరించలేను.. ఎప్పుడు వెళ్లిపోతానా అంటూ సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారు.. లాంటి కామెంట్లు చేస్తున్న ఈటల నిర్దిష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశంలో ఏం జరిగిందనే అంశంపైనా రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ ఈటల క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన ఇంకా గందరగోళంలోనే ఉన్నారని, ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చలకు అవకాశం ఇచ్చినట్లయింది.
వారి బాటలోనేనా?
తొలుత రూపొందించిన షెడ్యూల్ ప్రకారం షామీర్‌పేట్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈటల రాజేందర్ మీడియా సమావేశం ఖరారైంది. పొలిటికల్ అంశాలను మీడియాకు వెల్లడించనున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి వార్తలు వచ్చాయి. కానీ, సాయంత్రంకల్లా ఆ షెడ్యూల్ మారిపోయింది. ప్రెస్‌మీట్ రద్దయింది. మీడియా ముందుకు వస్తే స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీజేపీలోనే కొనసాగుతారా?.. పొంగులేటి, జూపల్లి తరహాలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారా?.. పార్టీ మారుతారా?.. బీజేపీలో అసంతృప్తిపై క్లారిటీ ఇస్తారా?.. అమిత్ షాతో చర్చించిన అంశాలను వెల్లడిస్తారా?.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలకు ఆయన బదులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
జమున ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ
పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే ఈటల దంపతులిద్దరూ షామీర్‌పేట్ నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు మీడియాకు ఇన్ఫర్మేషన్ వెళ్లింది. ఉదయం 11 గంటలకు ఈటల భార్య జమున, మధ్యాహ్నం 12 గంటలకు ఈటల రాజేందర్ మాట్లాడేలా తొలుత షెడ్యూల్ ఖరారైంది. కానీ ఈటల ప్రెస్‌మీట్ పూర్తిగా రద్దు కావడంతో జమున మీడియా కాన్ఫరెన్సు 11 గంటలకు బదులుగా 12 గంటలకు మారింది. మీడియా సమావేశంలో రాజకీయ సంబంధమైన అంశాలపై సంచలన ప్రకటన చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. ఇటీవలి కాలంలో అసంతృప్తితో ఉన్న ఈటల ఆఫ్ ది రికార్డుగా చేసిన కామెంట్లు ఆయనను వివాదంలోకి నెట్టాయి.
అందుకే ప్రెస్‌మీట్ రద్దు
కేసీఆర్ ప్రభుత్వాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె దించాలనే పట్టుదలతో ఉన్న ఈటల.. బీజేపీ నాయకత్వం అవలంబిస్తున్న విధానాలతో అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారనున్నట్లు వార్తలు వినిపించాయి. కాంగ్రెస్‌లోకి వెళ్తారనే ఊహాగానాలూ వచ్చాయి. తదుపరి పొలిటికల్ జర్నీపై ఈ ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇస్తారనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ ప్రెస్‌మీట్ రద్దుతో ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పాత్రికేయులు లేవనెత్తే అంశాలపై ఏం మాట్లాడినా మరింత వివాదాస్పదమవుతుందనే కారణంతో మీడియా ముందుకు రావొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
Read more: జోష్ మీదున్న హస్తం.. సూర్యాపేటలో మాత్రం వర్గపోరుతో సతమతం..!