- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీని కలిసే ధైర్యం కేసీఆర్‌కు లేదు: రాజాసింగ్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టబోతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి కలిసే ధైర్యం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. దమ్ము ఉంటే ప్రధానిని కలిసి రాష్ట్ర అభివృద్ధిపై అడగాలని సూచించారు. బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ రెండూ ఒకటే అని అన్నారు. కుట్ర పూరితకంగా తెలంగాణపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ప్రచారం చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. మధ్యాహ్నం 02:05 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకొని.. ప్రజా గర్జన సభలో పాల్గొంటారు.
Advertisement
Next Story