అభ్యర్థుల ఎంపికపై KTR, హరీష్ రావు ఫోకస్.. 75 మంది BRS క్యాండిడేట్ల పేర్లు ఫైనల్..!

by Satheesh |   ( Updated:2023-07-28 06:15:38.0  )
అభ్యర్థుల ఎంపికపై KTR, హరీష్ రావు ఫోకస్.. 75 మంది BRS క్యాండిడేట్ల పేర్లు ఫైనల్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఎవరిని ఫస్ట్ లిస్టులో పెట్టాలి? ఏ సెగ్మెంట్‌ను పెండింగ్‌లో పెట్టాలి? ఎక్కడ అభ్యర్థిని మార్చాలి? అనే అంశాలపై సీరియస్‌గా ఆరా తీసినట్టు సమాచారం. బుధవారం ప్రగతిభవన్‌లో అభ్యర్థుల ఎంపికపై సమావేశమైన బావబామ్మర్దులు గురువారం మరోసారి సమావేశం కావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో కుండపోతగా కురుస్తోన్న వర్షాల కారణంగా మీటింగ్ వాయిదా పడింది.

బావబామ్మర్దులకు కీలక బాధ్యతలు

2014, 2018 ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. ఆ లిస్టు ప్రకటించే వరకు రెండో కంటికి తెలిసేది కాదు. కానీ ఈసారి మాత్రం కేసీఆర్ అభ్యర్థుల కూర్పులో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు ప్రియారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ప్రగతిభవన్‌కు చేరుకున్న ఇద్దరు మంత్రులు ఐదారు గంటల పాటు సమావేశమయ్యారు.

ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతి సెగ్మంట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బలాబలాలను సర్వే రిపోర్టుల ఆధారంగా ఆరా తీశారని తెలుస్తున్నది. ఎవరిని మార్చాలి? ఎవరిని కొనసాగించాలి? ఏ పేరు ముందు ప్రకటించాలి? అనే అంశాలపై ఇరువురు పలురకాలుగా ఆలోచించినట్టు సమాచారం. అయితే ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చిన లిస్టును తుది ఆమోదం కోసం సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఫస్ట్ లిస్టు ఫైనల్

అభ్యర్థుల తొలి జాబితా కసరత్తు తుదిదశకు చేరిందని సమాచారం. ఎలాంటి వివాదాలు లేని సెగ్మంట్‌ను ముందుగా ప్రకటించి, మిగతా వాటిని తర్వాత ప్రకటించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. అయితే వివాదాలు లేని సెగ్మంట్‌లను సూత్రప్రాయంగా బావబామ్మర్దులు గుర్తించారని, రెండోసారి జరిగే మీటింగ్‌లో ఫైనల్ చేస్తారని తెలుస్తున్నది. అయితే ఈ లిస్టులో సుమారు 75 మంది వరకు అభ్యర్థులు ఉండొచ్చని తెలుస్తున్నది. మిగతా అభ్యర్థులను మాత్రం విపక్షాలు ప్రకటించిన తర్వాత అనౌన్స్ చేసే యోచనలో ఉన్నారు. కొందరు సిట్టింగ్‌లు పార్టీలో కొనసాగడంపై ఊగిసలాటలో ఉన్నారు. ఆ స్థానాల్లో సెకండ్ ఫేస్‌లో ప్రకటించే చాన్స్ ఉంది.

నిజ శ్రావణంలో అభ్యర్థుల ప్రకటన

తొలి జాబితా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ మంచి ముహూర్తం కోసం ఆన్వేషిస్తున్నారు. అయితే ఆగస్టు మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఈలోపు అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారు. అయితే తొలి జాబితాలో పేర్లు లేని ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఆందోళన చేస్తారేమోనని అనుమానంలో ఉన్నట్టు తెలిసింది. ఆగస్టు 17 తర్వాత నిజ శ్రావణంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్టును ప్రకటించే అవకాశం ఉంది.

Read More: ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌కు ఊహించని గండం.. సర్కార్‌కు సవాల్‌గా మారిన ‘సాయం’..!

‘జలగం’ను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయిస్తారా..? అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి

తెలంగాణ నెక్స్ట్ హోంమంత్రి నేనే.. ఆ తర్వాత సీఎం: ఎన్నికలకు ముందే BRS మంత్రి హల్ చల్

Advertisement

Next Story