కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు సీట్లు గల్లంతు.. కొత్త సెగ్మెంట్లు వెతుక్కోక తప్పదా?

by GSrikanth |
కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు సీట్లు గల్లంతు.. కొత్త సెగ్మెంట్లు వెతుక్కోక తప్పదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే కొన్ని సీట్లలో అభ్యర్థులు తారుమారయ్యే అవకాశమున్నది. మహిళలకు కేటాయించాల్సిన అసెంబ్లీ స్థానాలను ఏ ప్రాతిపదికన ఖరారు చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. జనాభా ప్రాతిపదికన ఉంటుందనే వాదన వినిపిస్తున్నది. ఎన్నికల సంఘం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఫార్ములా రూపొందిస్తుందని మరికొందరి అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం బిల్లులో పెట్టే అంశాలు, చర్చల సందర్భంగా వచ్చే సవరణలు, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా స్పష్టత వస్తుంది. ఓటర్ల సంఖ్యనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే రాష్ట్రంలో 61 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.

కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి సెగ్మెంట్‌లలో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల, హరీశ్‌రావు పోటీ చేస్తున్న సిద్దిపేట్‌లోనూ అంతే. దీంతో ఇప్పుడు చర్చల్లో నలుగుతున్నట్లుగా మహిళా ఓటర్ల సంఖ్యనే ఎలక్షన్ కమిషన్‌ ప్రామాణికంగా తీసుకుంటే ఈ నాలుగు స్థానాలను మహిళలకు కేటాయించి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కొత్త సెగ్మెంట్లను వెతుక్కోవడం తప్పనిసరి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గత నెల 21న ప్రకటించిన ఓటర్ల వివరాల ప్రకారం... (ట్రాన్స్ జెండర్లు, సర్వీస్ ఓటర్లు కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య)

గజ్వేల్ : (కేసీఆర్)

మహిళలు: 1,28,848

పురుషులు : 1,27,784

మొత్తం : 2,56,713

--------------

కామారెడ్డి : (కేసీఆర్)

మహిళలు : 1,21,164

పురుషులు : 1,13,415

మొత్తం : 2,34,769

--------------

సిరిసిల్ల : (కేటీఆర్)

మహిళలు : 1,18,639

పురుషులు : 1,14,370

మొత్తం : 2,33,115

--------------

సిద్దిపేట్ : (హరీశ్‌రావు)

మహిళలు : 1,12,721

పురుషులు : 1,11,227

మొత్తం : 2,24,067

Read More..

32 మంది అభ్యర్థులు ఔట్.. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టులో భారీ మార్పులు!

Advertisement

Next Story

Most Viewed