- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏఐసీసీ నుంచి కీలక ఆదేశాలు.. క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్..!
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలకు 60 స్థానాలు కేటాయించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీసీలకు ఏయే సీట్లు ఇవ్వాలనేది.. వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆదేశాలు అందాయి. ఆ తర్వాతనే అభ్యర్థుల అంశం తేల్చుదామని చెప్పినట్లు సమాచారం. స్టేట్ కమిటీలో చర్చించి వెంటనే సెగ్మెంట్‌ల పేర్లను పంపించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర పార్టీ బీసీలకు ఇవ్వాలనుకుంటున్న సెగ్మెంట్లను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు.. ప్రతీ పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లను ఇవ్వాలని రాష్ట్ర పార్టీ ఆలోచిస్తున్నది. కానీ.. జనాభా ప్రతిపాదికన తమకు 60 సీట్లు ఇవ్వాల్సిందేనని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో బీసీ సెగ్మెంట్లను ఎంపిక చేయడం పార్టీకి సవాల్‌గా మారింది.
పార్టీ కసరత్తు..?
బీసీలకు ప్రాథమికంగా 34 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. ఎలా ఇవ్వాలి? ఏ వర్గానికి ఎన్ని ఇవ్వాలి? ఉప కులాల పరిస్థితి ఏంటి? సమీకరణల వారీగా సాధ్యమవుతుందా? అనే అంశాలు పార్టీని సతమతం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన బీసీ నేతల సమావేశంలోనూ కాంగ్రెస్ సీనియర్లు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలు కూడా జనాభా ప్రాతిపాదికనే సీట్లు ఇవ్వాలనే డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. దీంతో జనరల్ సీట్లలో బీసీలకు సీట్లు సర్దుబాటు చేయడం కోసం పార్టీ కసరత్తు చేస్తున్నది. ఒకవేళ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో రెండు సీట్లు ఇవ్వడం కుదరకపోతే.. బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉన్నది. మరోవైపు బీసీలకు ఇవ్వాల్సిన చోట ఇప్పటికే బలమైన అభ్యర్థి ఉంటే.. ఇరు నేతలను సమన్వయం ఎలా? అంటూ కాంగ్రెస్ పార్టీ మదనపడుతున్నది.
బీసీలే పార్టీకి పునాది: వి హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో కాపాడేది బీసీ వర్గాలే. పార్టీకి వెన్నంటి ఉండి పవర్‌లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బీసీలకు జనాభా ప్రకారం సీట్లను కేటాయించాలని హైకమాండ్‌ను కోరినం. అతి త్వరలో తేలనున్నది. హైదరాబాద్ వచ్చాక సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకూ బీసీ సీట్లపై వివరిస్తా. కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలంతా ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి.