- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి లేఖ
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘానికి గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈనెల 11న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణకు వస్తుందని.. విచారణ జరిగేవరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని కృష్ణ మోహన్ రెడ్డి లేఖలో ఈసీని కోరారు. కాగా, 2018లో జరిగిన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు పత్రాలు సమర్పించారని అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటేసింది. ఈ ఏడాది ఆగస్టు 24న హైకోర్టు ఈ తీర్పును వెల్లడించింది. మాజీ మంత్రి డీకే అరుణను గద్వాల ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో డీకే అరుణను ఎమ్మెల్యేగా నిర్ధారించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంలో విచారణ జరిగే వరకు చర్యలు నిలిపివేయాలని సీఈసీకి రాసిన లేఖలో ఎమ్మెల్యే కోరారు.