- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BRS కీలక నేత షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదని శాసనమం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం గుత్తా మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తోందని విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలి. కానీ, కేంద్రం ఏదో కుట్ర చేస్తుంది. జమిలి ఎన్నికల పేరిట గందరగోళం సృష్టించింది కేంద్రం. కుట్రలు చేసి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.
న్యూసెన్స్ చేస్తూ కేంద్రం గట్టెక్కాలనే దురాలోచనలో కేంద్రం ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరోపణలు చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ద్రోహులు ఉన్నారని అంటున్న కాంగ్రెస్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారని అన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలు ప్రజలను మభ్యపెట్టేందుకే అని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు అమలు కావడం లేదని మండిపడ్డారు.
Read More..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే! (వీడియో)