షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2023-09-01 10:18:43.0  )
షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నేతల జంపింగ్‌లు, రాజకీయ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహలతో పాలిటిక్స్ రక్తికట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శిస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న టీ కాంగ్రెస్ కూడా వ్యూహలకు పదునుపెడుతుంది. బీఆర్ఎస్‌లో సీటు దక్కని బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకోనేందుకు పావులు కదుపుతుంది.

అలాగే మిగతా పార్టీల్లోని బలమైన నేతలను తమవైపు తిప్పుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లోకి షర్మిల విలీనం చేయడం ఖాయమనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తుండగా.. ఇప్పుడు ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. గురువారం హస్తినలో సోనియాగాంధీతో ఒక్కసారిగా షర్మిల భేటీ కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సమావేశంతో త్వరలో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై సోనియాగాంధీతో షర్మిల చర్చించినట్లు తెలుస్తోంది.

షర్మిలను టీ కాంగ్రెస్ నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముందే షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించగా.. తాజాగా షర్మిల కాంగ్రెస్ ఎంట్రీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ స్పందించారు. షర్మిల కాంగ్రెస్ చేరికను ఆయన కన్ఫామ్ చేశారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరుతుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కుటుంబం అంటే ఎంతో గౌరవమని తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని భట్టి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed