బీఆర్ఎస్‌, ఎమ్ఐఎమ్ మధ్య జరిగిన ఒప్పందం ఇదే: బండి సంజయ్

by GSrikanth |   ( Updated:2023-11-12 09:18:43.0  )
బీఆర్ఎస్‌, ఎమ్ఐఎమ్ మధ్య జరిగిన ఒప్పందం ఇదే: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల కోసం పోరాడి జైలుకు వెళ్లానని అన్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్న తనపై కేసీఆర్ ఏకంగా 74 కేసులు పెట్టించాడని తెలిపారు. ‘‘ప్రశ్నించే బండి సంజయ్ గొంతుకను కాపాడుకుంటారా..? పిసికేసుకుంటారా..? అంతిమ నిర్ణయం మీదే’’ అంటూ కుమార్ కరీంనగర్ ప్రజలను కోరారు. తాను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తనపై వ్యక్తిగత దూషనలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి కరీంనగర్ ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చేసిందేమీ లేదని చెప్పారు.

భూకబ్జాలు చేయడం, అవినీతికి పాల్పడటం, వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్లు చేయడం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కరీంనగర్‌ను ఎంఐఎంకు అప్పగించే కుట్ర చేస్తున్నయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే... అందుకు ప్రతిఫలంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించేలా ఒప్పందం కుదిరింది. గతంలో 12 మంది ఎంఐఎం కార్పొరేటర్లు గెలిస్తేనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే.. నల్లాజెండాలు పట్టుకుని తిరిగిన చరిత్ర ఉంది. మేయర్ పదవి ఇస్తే ఊరుకుంటారా..? ఇదే జరిగితే రేపటి నుండి బొట్టు పెట్టుకుని, కంకణం పెట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదు.. కరీంనగర్‌ను రక్షించేందుకే నేను పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story