- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదవి పోయాక ఫస్ట్ టైం అమిత్ షాతో బండి సంజయ్ భేటీ.. కారణం ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్ష పదవి కోల్పోయిన అనంతరం సోమవారం ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్య రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాజా రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలపై బండి సంజయ్ అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సప్సెన్షన్ ఎత్తివేయాలని అమిత్ షాను బండి సంజయ్ కోరినట్లు సమాచారం.
పార్టీలో తన వర్గాన్ని పక్కన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు వినికిడి. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి అందించిన సేవలను గుర్తించాలని అమిత్ షా వద్ద అభ్యర్థించినట్లు చెబుతున్నారు. అధ్యక్ష పదవి కోల్పోయిన అనంతరం మొదటిసారి అమిత్ షాతో బండి సంజయ్ భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. కాగా, బండి సంజయ్ తనను కలిసినట్టు స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా స్పష్టం చేయడం గమనార్హం. అయితే ఈ భేటీ కేవలం రాష్ట్ర రాజకీయ సమీకరణాలు తెలుసుకునేందుకే జరిగిందా లేదా దీని వెనుక ఏమైనా రహస్యం దాగి ఉందా అనేది తెలియాల్సి ఉంది.